తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో థళపతి విజయ్ తన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీతో కనీవినీ ఎరుగని రీతిలో రాజకీయ ప్రభంజనం సృష్టించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ, తన తొలి ఎన్నికల్లోనే విజయ్ నేతృత్వంలోని పార్టీ రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించింది. దశాబ్దాల చరిత్ర కలిగిన డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ప్రధాన పార్టీలను వెనక్కి నెట్టి TVK అగ్రస్థానంలో నిలవడం విశేషం.
విజయ్ రాజకీయాల్లో సెన్సేషనల్ డెబ్యూ చేశారు. ఎన్నికల ముందు విజయ్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఆయనకున్న అపారమైన ప్రజాదరణ మరియు చరిష్మా ముందు ప్రత్యర్థుల వ్యూహాలు పారలేదు.
ఏది ఏమైనా, ఈ ఫలితాలతో తమిళ రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైందని స్పష్టమవుతోంది.
