పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘కల్కి 2898 AD’ సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ప్రభాస్ ఈ రోజు రాత్రి నుండి ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ కాబోతున్నారు. ఆయనపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి హేమాహేమీలపై కీలక దృశ్యాల చిత్రీకరణ పూర్తయింది. ఈ రెండో భాగానికి ‘కర్ణ 3102 BC’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగం ముగింపులో ప్రభాస్‌ను కర్ణుడిగా చూపించడంతో, ఈ సీక్వెల్ పురాణ గాథలు మరియు కర్ణుడి పాత్ర నేపథ్యంగా మరింత ఆసక్తికరంగా సాగనుంది.
వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. దిశా పటాని కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించడంతో, ఇప్పుడు ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
