తలైవర్ 173 పై కొత్త అప్డేట్..!

rajini-kamal

తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘తలైవర్ 173’ చిత్రం కోసం రజనీకాంత్, కమల్ హాసన్ చేతులు కలిపారు. రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా, కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలువురు దర్శకులు మారిన తర్వాత, చివరకు ‘ఓ మై కడవలే’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు ఈ భారీ ప్రాజెక్టును తెరకెక్కించే బాధ్యతను అందుకున్నారు.

​అశ్వత్ మారిముత్తు ఇదివరకే ఏజీఎస్ సంస్థకు ఇచ్చిన కమిట్‌మెంట్‌ను, రజనీకాంత్ కోరిక మేరకు ఆ సంస్థ NOC ఇచ్చి రద్దు చేసింది. అశ్వత్ వినిపించిన కమర్షియల్ స్క్రిప్ట్‌కు సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా పనులు వేగవంతమయ్యాయి. ప్రస్తుతం దర్శకుడు స్క్రిప్ట్ తుది మెరుగుల్లో బిజీగా ఉన్నారు.

​ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానుంది. వేగంగా చిత్రీకరణ పూర్తి చేసి, 2027 సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని రాజ్ కమల్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తోంది. ఇద్దరు దిగ్గజాల కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version