ట్విస్ట్: విజయ్ స్థానంలోకి త్రిష ఎంట్రీ?

ఇప్పుడు ఇండియా వైడ్ గా దళపతి విజయ్ మాసివ్ విన్నింగ్ కోసమే అంతా మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. తన మొదటి ఎన్నికల్లోనే విజయ్ చక్రం తిప్పాడు. అయితే విజయ్ తమిళనాట రెండు స్థానాల్లో పోటీ చేసి గెలుపొందారు. పెరంబూరు అలాగే తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ చేసి గెలవడం వాటిలో ఊహించని విధంగా ఈస్ట్ లో రాజీనామా చేయడం వంటివి షాకింగ్ గా మారాయి.

అయితే ఇప్పుడు ట్విస్ట్ ఇస్తూ విజయ్ ప్లేస్ లోకి హీరోయిన్ త్రిష వస్తుంది అని క్రేజీ రూమర్స్ మొదలయ్యాయి. గత కొన్నాళ్ల నుంచి విజయ్, త్రిషల విషయంలో పలు వార్తలు,ముఖ్యంగా విజయ్ గెలిచిన తర్వాత ఓ రేంజ్ లో టాక్ వీరి కోసం మొదలైంది. ఇక ఈ క్రమంలో విజయ్ స్థానంలోకి త్రిష ఎంటర్ కానుంది అనే టాక్ మరింత షాకిచ్చింది.

అయితే విజయ్ అక్కడ రాజీనామా చేయడంతో త్రిష పేరు ఏమో కానీ విజయ్ తండ్రి కూడా అక్కడ నుంచి పోటీ చేస్తారని మరో వెర్షన్ వినిపిస్తుంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఆ సీటు నుంచి నిలబడతారో లేక త్రిష వార్త ఒట్టి గాలి వార్తేనా అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version