వైరల్ వీడియో: విజయ్ ఎలక్షన్ గెలుపును ముందే ఊహించిన స్టార్ హీరోయిన్.. నిజమైన పూజా హెగ్డే జోస్యం!

తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. తన పార్టీ ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) తరపున ఎన్నికల బరిలోకి దిగిన ఆయన.. ఎవరూ ఊహించని రేంజ్ లో సక్సెస్ సాధించారు. ఒకపక్క అభిమానులు, మరోపక్క సినిమా ఇండస్ట్రీ వర్గాలు విజయ్ కు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెబుతున్నాయి. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. విజయ్ ఎలక్షన్స్ లో గెలుస్తారని తాను ఎప్పుడో ఊహించానంటూ ఆమె షేర్ చేసిన వీడియో ఫ్యాన్స్ కు భలే కిక్ ఇస్తోంది.

నిజమైన బుట్టబొమ్మ జోస్యం!

విజయ్ తో కలిసి ‘జన నాయగన్’ సినిమాలో పూజా హెగ్డే నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ టైంలో తీసిన ఒక బిహైండ్-ది-సీన్స్ (BTS) వీడియోను ఇప్పుడు తన ఇన్‌స్టాలో పంచుకుంది. అందులో ఓ వైట్ బోర్డ్ మీద ఆంగ్లంలో “Who wins the ELECTIONS?” (ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు?) అని రాసి ఉండటం మనం చూడొచ్చు. ఆ బోర్డ్ దగ్గర నిలబడి సరదాగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చిన పూజా.. ఆనాటి మెమరీస్ ను తాజా ఎలక్షన్ రిజల్ట్స్ కు లింక్ చేస్తూ అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చింది. “ఇది జరగకముందే నేను ఊహించానని అనుకుంటున్నాను. కలలు ఇలా నిజరూపం దాల్చడం చాలా సంతోషంగా ఉంది విజయ్ సార్” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

సినిమాల్లో టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్.. తన మొదటి ప్రయత్నంలోనే ఇంతటి సంచలన విజయం నమోదు చేయడం మామూలు విషయం కాదు. పూజా షేర్ చేసిన ఈ పాత వీడియోలో షూటింగ్ సెట్ లో ఉన్న విజయ్ కూడా ఎంతో చిరునవ్వుతో కనిపిస్తున్నారు. అప్పుడు సరదాగా రాసుకున్న బోర్డు మీది ప్రశ్న.. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో నిజం కావడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. పూజా పోస్ట్ కి హార్ట్ ఎమోజీలతో లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఒక స్టార్ హీరో, ప్రజా నాయకుడిగా మారిన విజయ్ స్ఫూర్తిదాయక జర్నీకి ఇదొక పర్ఫెక్ట్ సెలబ్రేషన్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version