ట్రైలర్ రాకుండానే ‘పెద్ది’ బాక్సాఫీస్ మోత షురూ!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ సినిమానే పెద్ది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామా ఇంకా కథని రివీల్ చేసే టీజర్, ట్రైలర్ లాంటివి విడుదల చేసుకోలేదు. అయినప్పటికీ ఇప్పుడు యూఎస్ మార్కెట్ బుకింగ్స్ మోత చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర సరికొత్త లెక్కలు సెట్ అయ్యేలా ఉన్నాయని చెప్పాలి.

ఆల్రెడీ నార్త్ అమెరికాలో RRR సెట్ చేసిన ఫాస్టెస్ట్ 50 వేల డాలర్లు మార్క్ ని క్రాస్ చేసేసి సరికొత్త రికార్డులు అక్కడ సెట్ చేస్తుంది. ఓజి, పుష్ప 2 అలాగే దేవర లాంటి సినిమాలు ఒక రోజులో అందుకుంటున్న రెస్పాన్స్ ని పెద్ది కేవలం గంటల్లో బ్రేక్ చేస్తున్నట్టు టాక్. ఇదంతా ఇంకా ఎలాంటి ట్రైలర్ లేకుండానే కావడం విశేషం. ఇక ట్రైలర్ వచ్చాక మూమెంటం డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. సో అదెప్పుడు వస్తుందో చూడాలి.

Exit mobile version