శ్రీను వైట్ల ‘జార్జ్ క్రిష్’లో హీరోయిన్ ఖరారు.. శర్వా జోడీగా మానస వారణాసి

హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న ‘జార్జ్ క్రిష్’ (George Krish) చిత్రం నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఈ చిత్రంలో కథానాయికగా మానస వారణాసిని ఎంపిక చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. శర్వానంద్ సరసన ఆమె నటించనుండగా, వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై సరికొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ తెలిపారు.

ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత అనిల్ సుంకర భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. శ్రీను వైట్ల శైలి పూర్తిస్థాయి వినోదంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు.

ఈ సినిమా 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. పండుగ బరిలో విడుదల కానున్న ఈ చిత్రంలోకి మానస వారణాసి చేరికతో ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది.

Exit mobile version