మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇపుడు నటించిన సినిమా “పెద్ది” తో రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ముందు తెలుగు, తమిళ ఆడియెన్స్ ని అలరించడానికి వస్తున్న సాలిడ్ మాస్ చిత్రమే ‘వీర భద్రుడు’. దర్శకుడు ఆర్ జే బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమాల్లో సూర్య పవర్ ఫుల్ రోల్ లో నటించారు.
అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు ఆర్ జే బాలాజీ తెలుగు ఆడియెన్స్ అటెన్షన్ ని అందుకున్నాడు. తనకి మన తెలుగు నుంచి పర్శనల్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అంటే ఇస్తామని తాను చరణ్ ఫ్యాన్ ని అని స్టేజి సాక్షిగా తెలిపాడు. చరణ్ అన్ని సినిమాలు చూస్తానని అలాగే ఇప్పుడు రాబోతున్న ‘పెద్ది’ సినిమా కోసం కూడా ఎదురు చూస్తున్నానని తెలిపాడు.
దీనితో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. సో చరణ్ ఫ్యాన్ లిస్ట్ లో ఈ దర్శకుడు కూడా ఇప్పుడు చేరాడని చెప్పొచ్చు. ఇక ఈ వీర భద్రుడు సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా ఈ మే 14న గ్రాండ్ గా తమిళ్, తెలుగు భాషల్లో సినిమా విడుదల కాబోతుంది.
