మొత్తం మార్చేసిన విజయ్.. ‘జన నాయగన్’కి మళ్ళీ భారీ ఓటిటి ఆఫర్స్!?

Jana Nayagan

ఇళయ దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ హీరోగా నటించిన ఆఖరి చిత్రం “జన నాయగన్” మరికొన్ని రోజుల్లో రిలీజ్ కి రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ హైప్ సెట్ అయ్యిన ఈ సినిమాకి వచ్చిన ఇబ్బందులు కూడా అన్ని ఇన్ని కాదు. అయితే ఎట్టకేలకి ఈ సినిమా విజయ్ సీఎం అయ్యాకే రిలీజ్ అవ్వాలని రాసుందో ఏమో కానీ అన్ని ఇబ్బందులు తర్వాత ఇప్పుడు ఫైనల్ గా సీఎం విజయ్ పేరిట విడుదల కాబోతుంది.

అయితే ఈ చిత్రం ఇంత ఆలస్యం అవుతున్న కారణంగా అంతకు ముందు వచ్చిన ఓటిటి ఆఫర్స్ డీల్స్ పోయి చాలా తక్కువ ఓటిటి ఆఫర్లు ఈ చిత్రానికి వచ్చాయి. అయితే ఇప్పుడు విజయ్ దెబ్బతో మొత్తం మారింది కదా.. సో ఏవైతే ఓటిటి సంస్థలు విజయ్ సినిమాని వద్దు అనుకున్నాయో ఇప్పుడు అంతకు మించిన ఓటిటి ఆఫర్స్ తో వస్తున్నట్టు సినీ వర్గాల్లో వినిపిస్తుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో వారు జన నాయగన్ ని వద్దని వదులుకున్నారు. ఇప్పుడు మళ్ళీ భారీ ఆఫర్స్ అందిస్తున్నట్టు టాక్. అయితే ప్రైమ్ వీడియో తప్పుకున్నాక జీ 5 రేస్ లోకి వచ్చింది అని తెలిసింది. సో దానిని మేకర్స్ ఖాయం చేసారో లేదో అనేది ఫైనల్ ఓటిటి సంస్థ ఏంటి అనేది రివీల్ కావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజులు నటించగా అనిరుద్ సంగీతం అందించగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version