విడాకుల బాటలో ‘విశ్వంభర’ బ్యూటీ..?

mouni-roy

బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ తన వైవాహిక జీవితం పై వస్తున్న ఊహాగానాలతో ఇప్పుడు వార్తల్లో నిలిచింది. మౌనీ మరియు ఆమె భర్త సూరజ్ నంబియార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి తోడు, మౌనీ తన ప్రొఫైల్ నుండి సూరజ్‌తో కలిసి ఉన్న ఫోటోలను కూడా తొలగించినట్లు సమాచారం. అటు సూరజ్ కూడా తన ఇన్‌స్టా అకౌంట్‌ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.

సుమారు మూడేళ్ల ప్రేమ తర్వాత, ఈ జంట 2022 జనవరిలో గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు. 2019లో దుబాయ్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో మొదటిసారి కలుసుకున్న వీరు, అప్పటి నుండి అన్యోన్యంగా ఉంటూ వచ్చారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో, వీరిద్దరూ విడిపోతున్నారనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

దుబాయ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా ఉన్న సూరజ్ కానీ, మౌనీ కానీ ఈ పుకార్లపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఇక ఈ బ్యూటీ టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. మరి ఆమె విడాకుల వివాదం పై స్పష్టత రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Exit mobile version