కోలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన సూర్య హీరోగా త్రిష హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మాస్ చిత్రమే “వీర భద్రుడు”. కోలీవుడ్ లో ‘కరుప్పు’ గా వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్ లో ఒకేసారి రిలీజ్ కాబోతుంది. అయితే ఈ చిత్రం విడుదల రేపే అయినప్పటికీ ఇంకా ఎలాంటి మూమెంట్, బజ్ పెద్దగా తెలుగు వెర్షన్ లో కనిపించడం లేదు.
తక్కువ సమయంలో ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్ చేయడం తెలుగులో ప్రమోషన్స్ ని కూడా మిస్ చేయడంతో అనుకున్న రేంజ్ లో ఈ సినిమాకి ఇపుడు తెలుగు బుకింగ్స్ కనిపించడం లేదు. దీనితో ఓపెనింగ్స్ సూర్య గత చిత్రం రెట్రో కంటే తక్కువే వచ్చేలా ఉన్నాయని చెప్పక తప్పదు. సో ఈ చిత్రానికి డెఫినెట్ గా సాలిడ్ మౌత్ టాక్ వస్తే కానీ రేపు మార్నింగ్ షోస్ తర్వాత బుకింగ్స్ ఊపందుకుంటాయేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకార్ సంగీతం అందిస్తున్నాడు అలాగే డ్రీం వారియర్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
