బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తో దర్శకుడు ఆదిత్య ధర్ అలాగే హీరో రణ్వీర్ సింగ్ లు ఒక్కసారిగా బిగ్గెస్ట్ స్టార్స్ గా నిలిచారు. మరి ఆ చిత్రమే “ధురంధర్”. ఒక స్పై యాక్షన్ సినిమా అంటే ఇలా ఉండాలి అనే విధంగా అర్ధం చూపించిన ఈ సినిమా పార్ట్ 2 కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ ని అందుకుంది. అయితే గత ఏప్రిల్ లో విడుదల అయ్యిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించి దుమ్ము లేపింది.
మరి అక్కడ నుంచి ఫైనల్ గా ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ కి వచ్చేసింది. కానీ ఈ చిత్రం ఇవాళ్టి నుంచి కేవలం ఓవర్సీస్ ఆడియెన్స్ కి మాత్రమే అందుబాటులో ఉంది. సో ఇండియాలో తప్ప మిగతా దేశాల్లో ఆడియెన్స్ ధురంధర్ 2 ని ఎంజాయ్ చేయొచ్చు. పార్ట్ 2 హక్కులు జియో హాట్ స్టార్ మరియు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి.
అయితే ఓవర్సీస్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఇవాళ్టి నుంచి పాన్ ఇండియా భాషల్లో అది కూడా అన్ కట్ వెర్షన్ లో విడుదల కావడం విశేషం. దీనితో ఫ్యాన్స్ కి మాత్రం ఇదొక సాలిడ్ ట్రీట్ అని చెప్పొచ్చు. నెట్ ఫ్లిక్స్ లో సినిమా వచ్చేసింది కాబట్టి ఇక హాట్ స్టార్ లో కూడా త్వరగానే వచ్చే ఛాన్స్ ఉంది. మరి వీరెప్పుడు డేట్ ఇస్తారో చూడాలి.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
