రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘డేవిడ్ రెడ్డి’. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఐతే, తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ ఉందని.. ఈ పాత్రలో ఓ యంగ్ హీరో కనిపిస్తాడని తెలుస్తోంది. క్లైమాక్స్ లో వచ్చే ఈ పాత్ర చుట్టూ ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా నడుస్తోందని టాక్ నడుస్తోంది.
ఇక ‘డేవిడ్ రెడ్డి’ కథ విషయానికొస్తే.. స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఇది. బ్రిటిష్ వారిపై పోరాడిన ‘డేవిడ్ రెడ్డి’ అనే యోధుడి కథగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ‘వార్ డాగ్’ అనే బైక్ను రూపొందించారు. దాని బరువు దాదాపు 700 కేజీలు. సినిమాలో అది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అన్నట్టు ఈ సినిమాలో మనోజ్ సరసన ‘ప్రిన్స్’ (కోలీవుడ్ మూవీ) హీరోయిన్ మరియా నటించబోతుంది.
