మన టాలీవుడ్ స్టార్ కమెడియన్ సత్య మెయిన్ లీడ్ లో తన దర్శకుడు రితేష్ రానా కాంబినేషన్ లో చేసిన రీసెంట్ కామెడీ చిత్రమే “జెట్ లీ”. అయితే సత్య నుంచి ఇది వరకు పలు సినిమాల్లో కామెడీ రోల్స్ లో మాత్రమే చూస్తే తనపై మొదటిసారి పూర్తి లీడ్ పాత్రలో ఈ సినిమా రావడం జరిగింది.
ఇంట్రెస్టింగ్ ప్రమోషన్ లు అలాగే టీజర్, ట్రైలర్ లతో కావాల్సినంత బజ్ ని ఈ చిత్రం సొంతం చేసుకుంది. కానీ థియేటర్స్ లో మాత్రం అనుకున్న అంచనాలు రీచ్ కాలేకపోయింది. ఇక ఫైనల్ గా సినిమా ఇప్పుడు ఓటిటిలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.
ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ మే 25 నుంచి అందుబాటులో ఉంటుంది అని కన్ఫర్మ్ చేసేసారు. అయితే ప్రస్తుతానికి తెలుగు వెర్షన్ మాత్రమే కన్ఫర్మ్ కాగా పాన్ ఇండియా వెర్షన్ లలో దాదాపు ఉండకపోవచ్చు అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.
