మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం పెద్ది నుంచి అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సాలిడ్ ట్రైలర్ కట్ రేపు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే దీని తాలూకా సాలిడ్ అవుట్ పుట్ తాలూకా రీసౌండింగ్ మాత్రం సినీ వర్గాల్లో ఓ రేంజ్ లో మోత మోగిపోతుంది.
అయితే ఈ ట్రైలర్ పై లేటెస్ట్ గా మాస్ ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగవంశీ చేసిన పోస్ట్ ఇపుడు ఫ్యాన్స్ ని మరింత వెర్రేత్తిస్తోంది. ట్రైలర్ చూసిన తర్వాత నాగవంశీ రెస్పాన్స్ అయితే మాములుగా లేదు. ఇప్పుడే పెద్ది ట్రైలర్ చూసాను ఇది అవుట్ ఆఫ్ ది పార్క్ లా ఉంది. కోహ్లీ క్రికెట్ ఆడటం చూసి ఉంటారు కానీ అదే కోహ్లీ కుస్తీ పడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అలా ఉంది అంటూ ట్రైలర్ ని ఆకాశానికి ఎత్తేసారు.
రామ్ చరణ్ బీస్ట్ మోడ్ లో అదరగొట్టారు, జాన్వీ కపూర్ రవిషింగ్ గా ఉంది. ఇక లాస్ట్ లో ఒక క్రాసోవర్ షాట్ అయితే పూర్తిగా మాస్ సినిమా అంటూ ఓ రేంజ్ లో సినిమా ట్రైలర్ పై రివ్యూ ఇవ్వడం వైరల్ గా మారింది. దీనితో రేపు ట్రైలర్ పై హైప్ మరింత రేంజ్ లో ఎక్కువయ్యిపోయింది.
Just watched the #PeddiTrailer… this one is going straight OUT OF THE PARK💥
Kohli Cricket…adatam andaru chusaru kadha adhe Kohli kusthi kuda aadithe Ela untundo just imagine ala Undi🔥🔥🔥
Mega Powerstar @AlwaysRamCharan garu in an absolute beast mode! ❤️🔥#JanhviKapoor…
— Naga Vamsi (@vamsi84) May 17, 2026
