దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు కలయికలో రాబోతున్న సినిమా ‘వారణాసి’. ఈ సినిమా పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఐతే, మహేష్ బాబుకి సంబధించిన మిగిలిన షూటింగ్ పార్ట్ ను సెప్టెంబర్ చివర్లో పూర్తి చేయనున్నారని, మొత్తం షూటింగ్ అక్టోబర్ మూడో వారంలో పూర్తి అవుతుందని తెలుస్తోంది. అలాగే, కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు సెప్టెంబర్‌లో ప్రారంభించనున్నారు. సినిమాలో మొత్తం 6 పాటలు ఉండనున్నట్లు ఆయన గతంలో వెల్లడించారు.
కాగా ప్రియాంక ఈ సినిమాలో మందాకినిగా కనిపిస్తూ ఉండగా.. మహేశ్ రుద్రగా.. శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాగా ‘వారణాసి’ చిత్రం రూ.1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను కెఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండగా, కథా కథనాన్ని విజయేంద్ర ప్రసాద్ రూపొందించారు. ఇక ఈ సినిమాకి దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.
