ఇళయరాజాకు ‘వీర భద్రుడు’ టీం క్షమాపణ.. అసలేం జరిగిందంటే?

ఇండియన్ సినిమా లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా విషయంలో ఈ కొన్నేళ్లలో పలు కాంట్రవర్సీలు ఏ విధంగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్ గా లిస్ట్ లో సూర్య నటించిన కరుప్పు/ వీర భద్రుడు సినిమా కూడా యాడ్ అయ్యింది. దీనితో మేకర్స్ ఇప్పుడు అధికారిక ప్రెస్ నోట్ ని విడుదల చేసి మ్యాస్ట్రో ఇళయరాజాకు క్షమాపణ చెబుతున్నారు.

అసలు ఇంతకీ ఏమైందంటే సినిమా సెకండాఫ్ లో ఓ సీన్ వద్ద ఇళయరాజాకు సంబంధించి చిన్నపాటి డైలాగ్ ఉంటుంది. అయితే ఆ సందర్భానికి అది అనుచితం కాగా ఇదే వివాదానికి దారి తీసింది. దీనితో మేకర్స్ అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేసి తాము సినిమాలో కావాలని ఆ సీన్ పెట్టలేదని రాజా గారి గౌరవ మర్యాదలకి భంగం కలిగించే ఉద్దేశం తమకి లేదు అని క్షమాపణ కోరారు. దీనితో ఈ ప్రెస్ నోట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక దీనిపై ఇళయరాజా స్పందన ఏంటి అనేది కూడా వేచి చూడాలి.

Exit mobile version