మన టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ కపుల్ జంట సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నాలు తన ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లి ఇపుడు హ్యాపీ లైఫ్ ని అటు సినిమాలు ఇటు పర్శనల్ గా కూడా లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా రష్మికకి సంబంధించి కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో నెటిజన్స్ దృష్టిని ఆకర్షించాయి. రష్మిక మందన్న మోచేతిపై కనిపించిన ఓ సరికొత్త పచ్చబొట్టు వైరల్ గా మారింది.
అయితే ఇది చూసిన నెటిజన్స్ మాత్రం రష్మికకి విజయ్ అంటే ఇంత ప్రేమ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. మరి అంతలా ఏం రాయించుకుంది అంటే.. ‘ఇర్రీప్లేసబుల్’ అంటూ ఆమె చేతికి కనిపించింది. అంటే ‘ఎవరూ నీ స్థానాన్ని భర్తీ చేయలేరు’ అన్నట్టుగా రష్మిక తన ప్రేమని విజయ్ పై ఈ రేంజ్ లో వ్యక్తం చేయడం అనేది ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ ఇద్దరి కలయికలో ప్రస్తుతం ‘రణబాలి’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాదిలో విడుదల కానుంది.
