కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులు ఎంతో కాలంగా కోరుకుంటున్న అవైటెడ్ కంబ్యాక్ ఇప్పుడు ఫైనల్ గా తన తాజా చిత్రం “కరుప్పు”తో వచ్చింది. తెలుగులో వీర భద్రుడు గా వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి సూర్య కెరీర్ లోనే ఇపుడు బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం మొదటి వారం రన్ ని పూర్తి చేసుకోగా ఈ గ్యాప్ లోనే సాలిడ్ నంబర్స్ ని కోలీవుడ్ దగ్గర ఊహించని రీతీలో సెట్ చేసి పెట్టింది.
ఇలా కేవలం వారం రోజుల్లోనే ఏకంగా 200 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసి మొత్తం 207 కోట్లు ఈ సినిమా అందుకొని సూర్యకి ఒక సెన్సేషనల్ కంబ్యాక్ గా ఈ చిత్రం నిలిచింది. ఇక ఈ చిత్రం నెక్స్ట్ టార్గెట్ 300 కోట్ల మార్క్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి ఇది కూడా సాధ్యమైతే కోలీవుడ్ లో మరో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా సాయి అభ్యంకార్ సంగీతం అందించాడు. అలానే డ్రీం వారియర్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.
