ఆ డైరెక్టర్‌తో బాలయ్య సినిమా.. ఇక లేనట్టేనా..?

Nandamuri-Balakrishna

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో NBK111 ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా పూర్తికాక ముందే తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నట్లు ప్రకటించాడు. దీంతో పాటు మరో యంగ్ డైరెక్టర్‌తో కూడా బాలయ్య సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. ‘సరిపోదా శనివారం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ.

బాలయ్య కోసం వివేక్ ఆత్రేయ ఓ కథను రెడీ చేశాడని.. అది బాలయ్యకు కూడా వినిపించాడని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపించింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుందనే వార్త కూడా హల్‌చల్ చేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అటకెక్కినట్లు తెలుస్తోంది. కొన్ని కారణాల వల్ల ఈ కాంబో మిస్ అయ్యిందని సినీ వర్గాల టాక్.

అయితే, వివేక్ ఆత్రేయ ఈ కథను మాస్ రాజా రవితేజకు వినిపించగా, ఆయన ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను త్వరలోనే ప్రకటించబోతుందని తెలుస్తోంది. రవితేజ ప్రస్తుతం ‘ఇరుముడి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే, వివేక్ ఆత్రేయతో సినిమాను ప్రారంభిస్తాడట. మరి ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Exit mobile version