మలయాళ సినిమా లెజెండరీ నటులు మోహన్ లాల్ అలాగే మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ సినిమానే ‘పేట్రియాట్’. మామూలు ఇలాంటి మల్టీస్టారర్ సినిమాలు రావడం అనేదే చాలా అరుదు కానీ ఈ సినిమాకి ఊహించని రీతిలో షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజే టాక్ పాజిటివ్ గా రాకపోవడంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అంత పెద్ద స్టార్స్ ఉన్నప్పటికీ సినిమా మినిమమ్ ఓపెనింగ్స్ కూడా అందుకోలేకపోవడం అనేది ఒకింత షాకింగ్ అనే చెప్పొచ్చు.
ఇలా థియేటర్స్ లో ఫెయిల్యూర్ అయ్యిన ఈ సినిమా ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీలో అలరించేందుకు సిద్ధం అయ్యింది. ఇక ఈ సినిమాని జీ 5 సంస్థ సొంతం చేసుకోగా అందులో ఈ జూన్ 5 నుంచి సినిమా రానున్నట్లు ఖరారు చేసారు. ఒరిజినల్ మలయాళంతో పాటుగా తెలుగు, హిందీ ఇతర పాన్ ఇండియా భాషల్లో సినిమా విడుదల కానున్నట్లు కన్ఫర్మ్ చేసారు. ఇక ఈ సినిమాకి మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించగా కేజీ అనీల్ కుమార్, ఆంటో జోసెఫ్ లు నిర్మాణం వహించారు.
