విజయ్ గెలుపుపై పవన్ జెలసీ! కానీ రియాలిటీ మాట్లాడిన పవర్ స్టార్

pawan-kalyan

దక్షిణాది సినిమా దగ్గర భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోస్ లో మన తెలుగు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలానే తమిళ్ నుంచి దళపతి విజయ్ లు ముందు వరుసలో ఉంటారు. వీరి సినిమాలకి వచ్చే రెస్పాన్స్, సోషల్ మీడియా బలం ఇంచుమించు దగ్గరగానే ఉంటాయి. అయితే వీరి ఇద్దరి నుంచి పొలిటికల్ స్టెప్ లో మాత్రం అందుకు చాలా భిన్నమైన ఫలితాన్ని ఇరువురు అందుకున్నారని చెప్పాలి.

అయితే విజయ్ తన మొదటి పోటీలోనే సీఎం అయ్యారు కానీ పవన్ మాత్రం ఎన్నో అవాంతరాలు చూసి డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అయితే తమిళనాట విజయ్ గెలుపు చూసి తనకి అసూయ కలిగింది అని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం తెలుగు ఆడియెన్స్ లోనే కాకుండా తమిళ ఆడియెన్స్ లో కూడా వైరల్ గా మారింది. విజయ్ కటౌట్లు, తన హోలో గ్రామ్స్ తో సీఎం అయ్యిపోయాడని తెలిపారు.

కానీ తనకి 15 ఏళ్ల ప్రయాణం చేస్తే కానీ ఇంతవరకు రాలేదని చెప్పారు. అయితే ఇక్కడే తన ఫ్యాన్స్ కి విజయ్ ఫ్యాన్స్ కి ఉన్న రియాలిటీ కూడా తెలిపారు. విజయ్ అభిమానులు తన కోసం అంతా ఒక్కటై గెలిపించుకున్నారని కానీ నాకు అలా కాదు తన అభిమానులే వర్గాలుగా విడిపోయారని మన దగ్గర పరిస్థితులు అలా కాదని ఉన్నది ఉన్నట్టే చెప్పడం తన ఫ్యాన్స్ కి కూడా చెంప పెట్టుగా మారింది. మొత్తానికి అయితే పవన్ నుంచి ఈ రకమైన ఊహించని స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Exit mobile version