ఏపీలో ‘పెద్ది’ బుకింగ్స్ పై లేటెస్ట్ బజ్!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం “పెద్ది” కోసం బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ని బుచ్చిబాబు సానా తెరకెక్కించగా ఇప్పుడు సినిమా విడుదల దగ్గరకి వస్తున్న నేపథ్యంలో మేకర్స్ ఓ పక్క ప్రమోషన్స్ మరోపక్క సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా చేస్తున్నారు.

అయితే ఈ చిత్రం బుకింగ్స్ పట్ల కూడా తెలుగు స్టేట్స్ ఆడియెన్స్ లో ఆసక్తి నెలకొంది. ఆల్రెడీ యూఎస్ మార్కెట్ లో బుకింగ్స్ మొదలయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మొదలు కావాల్సి ఉంది. అయితే నైజాం మార్కెట్ లో ఏమో కానీ ఏపీ కి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

దీని ప్రకారం పెద్ది బుకింగ్స్ ఈ మే 30న ఫుల్ ఫ్లెడ్జ్ గా ఓపెన్ కానున్నాయి అని సమాచారం. అలాగే ప్రీమియర్స్ కూడా పడే ఛాన్స్ లు ఏపీ వైపు గట్టిగా ఉన్నాయి. సో దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించగా ఈ జూన్ 4న పాన్ ఇండియా లెవెల్లో సినిమా విడుదల కాబోతుంది.

Exit mobile version