వెంకీ సినిమా కోసం అనిల్ రావిపూడి ‘కొత్త’ స్ట్రాటెజీ..!

Venkatesh-Anil-Ravipudi

టాలీవుడ్ హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం తన కొత్త సినిమాను విక్టరీ వెంకటేష్‌తో కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోయే ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర్నుండి ఈ మూవీపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే, అనిల్ రావిపూడి లాస్ట్ రెండు చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు భీమ్స్ సిసిరోలియో. దీంతో ఈసారి కూడా భీమ్స్‌తోనే అనిల్ రావిపూడి కంటిన్యూ అవుతాడు అని అందరూ భావించారు. కానీ, తాజాగా ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి మరో మ్యూజిక్ డైరెక్టర్‌ను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్‌ను వెంకీ-అనిల్ కొత్త ప్రాజెక్ట్ కోసం తీసుకున్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

ఈ కాంబినేషన్ రిఫ్రెషింగ్‌గా ఉండటమే కాకుండా మ్యూజిక్‌లోనూ వైవిధ్యం ఉంటుందని అనిల్ రావిపూడి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడట. దీంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఈ మూవీపై మరోసారి హైప్ క్రియేట్ అవుతుంది. మరి ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన ఏదైనా చేస్తారేమో చూడాలి.

Exit mobile version