మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేసిన భారీ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే “పెద్ది”. ఒక మల్టీ స్పోర్ట్స్ డ్రామాగానే కాకుండా ఎమోషనల్ గా ఎంతో కదిలించే సబ్జెక్టుగా ఇది రాబోతుంది. ఇక ఈ చిత్రం రిలీజ్ దగ్గరకి వస్తున్న నేపథ్యంలో సినిమా నుంచి రిలీజ్ ట్రైలర్ ని చాలామంది ఆశిస్తున్నారు. మొదటగా వచ్చిన ట్రైలర్ యునానిమస్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని అందుకోలేదు. దీనితో చాలామంది ఒక్క సరైన రిలీజ్ ట్రైలర్ ని మాత్రం ఆశిస్తున్నారు.
అయితే ఈ ట్రైలర్ పనులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ ట్రైలర్ వస్తుందా లేదా అనేది పూర్తిగా మేకర్స్ చేతుల్లోనే ఉంది. కానీ ఒకవేళ వస్తే మాత్రం రేపు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచే వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీనిపై క్లారిటీ రేపే రావచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ జూన్ 4న సినిమా పాన్ ఇండియా భాషల్లో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
