కోలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన ధనుష్ హీరోగా మమితా బైజు హీరోయిన్ గా దర్శకుడు విగ్నేష్ రాజా తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం తమిళ్ సహా తెలుగులో కూడా విడుదల అయ్యింది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసి ప్లాప్ గానే ముగిసింది. కానీ తర్వాత ఓటిటిలోకి వచ్చాక మాత్రం ‘కర’ సినిమాకి బెటర్ రెస్పాన్స్ వచ్చింది అని చెప్పొచ్చు.
దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ సినిమా నెగిటివ్ కంటే ఈసారి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని అందుకుంది. ఇలా ఇందులో మాత్రం హిట్ గానే నిలిచి సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో కర చిత్రం ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. దీనితో ఓటిటిలో మాత్రం ఈ సినిమా అదరగొడుతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో కే ఏ రవికుమార్, కరుణాస్, జైరాం తదితరులు కీలక పాత్రల్లో నటించగా జీవి ప్రకాష్ సంగీతం అందించాడు.
