పెద్ది ప్రీ-రిలీజ్ ఈవెంట్ : సాలిడ్ కాంఫిడెన్స్ తో చరణ్ స్పీచ్..!

Ram-charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీరిలీజ్ ఈవెంట్ విజయవాడలో ఘనంగా జరిగింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఈ కథ నా మనసుకు చాలా దగ్గరైంది. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ఫీలింగ్ కలిగింది. అభిమానుల కోసం రక్తం చిందించడానికైనా సిద్ధం. బుచ్చిబాబు భవిష్యత్తులో టాప్ డైరెక్టర్ అవుతారు. జాన్వీ కపూర్, ఏఆర్ రెహమాన్, రత్నవేలు ఈ సినిమాకు పిల్లర్స్.. అని అన్నారు.

​దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ‘ఉప్పెన’ తర్వాత ఐదేళ్లు కష్టపడి ఈ కథ రాశాను. ఇది ఒక ఆటగాడి ఆత్మగౌరవ పోరాటం. రామ్ చరణ్ నన్ను పూర్తిగా నమ్మారు. జగపతి బాబు గారి అప్పలసూరి పాత్ర, రెహమాన్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి.. అని తెలిపాడు.

ఇక ​నిర్మాతలు రవిశంకర్, సతీష్ కిలారు మాట్లాడుతూ.. చరణ్ ఎంతో అంకితభావంతో నటించారు. షూటింగ్‌లో గాయాలైనా లెక్కచేయలేదు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇదొక ఎక్స్‌ట్రార్డినరీ రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్‌బస్టర్ అని చెప్పారు.. అంటూ తమ కాంఫిడెన్స్ తెలిపారు.

మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ కేశినేని చిన్ని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ చరణ్‌తో నటించడం ఒక గొప్ప అనుభవమని చెప్పారు. జగపతి బాబు తన కెరీర్‌లోనే ఇది బెస్ట్ క్యారెక్టర్ అనగా, అనంత శ్రీరామ్, రత్నవేలు ‘పెద్ది’ విజువల్ స్పెక్టాకిల్‌గా చరిత్రలో నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version