‘అడ్రస్ పెట్టూ..’.. అభిమానితో తారక్ ఫన్నీ చాట్ వైరల్..!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు వంట చేయడం అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. గతంలో ఆయన చికెన్ బిర్యానీతో పాటు పలు రకాల వంటకాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తన తల్లి నుంచే తాను వంట నేర్చుకున్నానని, ఖాళీ సమయాల్లో వంట చేయడం తనకు ఎంతో ఇష్టమని ఎన్టీఆర్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు.

తాజాగా, ఎన్టీఆర్ తనే స్వయంగా బేక్ చేసిన ‘చాక్లెట్ చిప్ కుకీస్’ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. దానికి ‘కొన్నవి కావు.. నేనే బేక్ చేశాను’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అయితే, ఈ స్టోరీని చూసిన ఒక అభిమాని ఆ వీడియోను ఎక్స్‌ వేదికగా షేర్ చేస్తూ.. ‘అన్నా.. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నాకు రెండు కుకీస్ కావాలి’ అంటూ తారక్‌ను ట్యాగ్ చేశాడు.

సాధారణంగా ఇంతటి స్టార్ హోదాలో ఉన్న హీరోలు ఇలాంటి వాటికి స్పందించడం అరుదు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ ఫ్యాన్ ట్వీట్‌కు బ్రహ్మానందంకు సంబంధించిన ఒక హిలేరియస్ మీమ్‌తో రిప్లై ఇచ్చాడు. తారక్ ఇచ్చిన ఈ ఫన్నీ రిప్లై చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఒక స్టార్ హీరో ఇలా సాదాసీదాగా అభిమానులతో సోషల్ మీడియాలో సరదాగా గడపడం అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో ఎన్టీఆర్ ఇచ్చిన ఆ రిప్లై ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Exit mobile version