విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ ట్రైలర్ విడుదల

విజయ్ ఆంటోని, స్వాసిక జంటగా నటించిన కొత్త చిత్రం ‘వంద దేవుళ్ళు’. శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. సర్వంత్ రామ్ క్రియేషన్స్, విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై రామాంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను నటి, నిర్మాత నిహారిక కొణిదెల సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

‘ఈ లోకంలో ప్రాణాలతో పుట్టిన అందరికీ కనీస అవసరాలుంటాయి.. తినడం, నిద్రపోవడం, తోడు వెతుక్కోవడం’ అనే సంభాషణతో ట్రైలర్ ప్రారంభమైంది. భార్యాభర్తలు, తల్లీకొడుకుల అనుబంధం, ఎమోషన్స్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందానికి నిహారిక శుభాకాంక్షలు తెలిపారు. భావోద్వేగాలు, బంధాలతో ముడిపడి ఉన్న ఈ కథతో విజయ్ ఆంటోని మరో మంచి విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు.

ఈ చిత్రంలో అజయ్, కావ్య, బాలాజీ శక్తివేల్, మునిష్ కాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాలాజీ శ్రీరామ్ సంగీతం అందించిన ఈ సినిమాకు ఎస్.బి. దర్శన్ కిర్లోష్ సినిమాటోగ్రాఫర్‌గా, భాష్య శ్రీ మాటల రచయితగా పనిచేశారు.

Exit mobile version