సెన్సార్ పనులు ముగించుకున్న ‘మా ఇంటి బంగారం’.. సామ్ సినిమాకు లైన్ క్లియర్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’. లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. ఈ చిత్రాన్ని సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, ఆమె భర్త రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఇక విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ఈ చిత్రం తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుని ‘యూ/ఏ’ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సమంత రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది. ఇందులో ఒకవైపు యాక్షన్ ప్యాక్డ్ అవతార్‌లో మాస్ లుక్‌లో కనిపిస్తూనే, మరోవైపు అమాయకపు కోడలిగా క్లాస్ లుక్‌లో అలరించనుంది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి, శ్రీలక్ష్మి, అంజలి, సత్యరాజ్ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. స్టార్ కంపోజర్ సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. మరి ఈ సినిమాతో సామ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Exit mobile version