ధనుష్ సరికొత్త సాహసం.. కొడుకును డైరెక్ట్ చేయనున్న యాక్టర్..?

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం మోస్ట్ బిజీయెస్ట్ యాక్టర్‌గా నిలిచాడు. ఇక ఆయన హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్‌గా కూడా రాణిస్తూ సినిమాలు చేస్తు్న్నాడు. అయితే, త్వరలోనే ధనుష్ ఓ సరికొత్త సాహసం చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఆయన తన పెద్ద కుమారుడు యాత్రను హీరోగా పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాడట.

ఇక ఈ ప్రాజెక్ట్‌ను ధనుష్ స్వయంగా డైరెక్ట్ చేయనున్నాడని కోలీవుడ్ వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది. ఈ ప్రెస్టీజియస్ సినిమాను ‘ఆర్‌టేక్ స్టూడియోస్’, ధనుష్ సొంత సంస్థ ‘వుండర్‌బార్ ఫిల్మ్స్’తో కలిసి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. ప్రస్తుతం యాత్ర యాక్టింగ్, డ్యాన్స్‌లో ట్రెయినింగ్ తీసుకుంటున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రత్యేక టెస్ట్ షూట్ నిర్వహించనున్నారు.

ధనుష్ తన ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, వేల్‌రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. తండ్రి దర్శకత్వంలో కొడుకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుండటంతో సినీ వర్గాల్లో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగాయి.

Exit mobile version