శార్వరి ఎక్కడ? : కో-స్టార్‌ కోసం రంగంలోకి అలియా భట్.. ట్రోలర్స్‌కు అదిరిపోయే కౌంటర్

ముఖ్య అంశాలు

  • ఆల్ఫా టీజర్‌లో శార్వరికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్న ట్రోల్స్‌కు అలియా భట్ తనదైన స్టైల్‌లో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.
  • శార్వరితో కలిసి ‘ఆల్ఫా’ టీ షర్ట్స్ వేసుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘శార్వరి ఎక్కడ?’ అని క్యాప్షన్ పెట్టి విమర్శకులకు సెటైర్ వేశారు.
  • ఈ పోస్ట్‌కు శార్వరి ‘ప్రెజెంట్ మిస్’ అంటూ ఫన్నీగా రిప్లై ఇవ్వడంతో నెట్టింట ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.

యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న ‘ఆల్ఫా’ టీజర్ ఎంత బజ్ క్రియేట్ చేసిందో.. అందులో “శార్వరి ఎక్కడ?” అంటూ నెటిజన్ల నుంచి అంతే స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఈ విమర్శలపై సైలెంట్‌గా ఉంటే లాభం లేదనుకున్నారో ఏమో కానీ, అలియా భట్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. విమర్శకులు ఏ పాయింట్ పట్టుకుని అయితే ట్రోల్ చేశారో.. కరెక్ట్‌గా అదే పాయింట్‌తో వాళ్ల నోరు మూయించారు.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అలియా ఒక క్యూట్ అండ్ సెటైరికల్ పోస్ట్ షేర్ చేశారు. ఇందులో అలియా, శార్వరి ఇద్దరూ ‘ALPHA’ అని రాసి ఉన్న వైట్ టీ-షర్ట్స్ వేసుకుని చాలా స్టైలిష్‌గా పోజులిచ్చారు. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫోటోలో వీరిద్దరి బాండింగ్ ఎంతలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఈ ఫోటోకు అలియా పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు హైలైట్‌గా మారింది. “శార్వరి ఎక్కడ?” అంటూ ట్రోలర్స్ అడిగిన ప్రశ్ననే తానూ రిపీట్ చేస్తూ వాళ్లకి గట్టి సెటైర్ వేశారు.

అలియా వేసిన ఈ సెటైర్‌కు శార్వరి కూడా అంతే ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. “ప్రెజెంట్ మిస్స్!!! ” అంటూ స్కూల్ పిల్లాడిలా కామెంట్ బాక్స్‌లో అటెండెన్స్ వేయడం అందరినీ నవ్విస్తోంది. వీళ్ల ఎనర్జీ చూసి ఫిలింఫేర్, ఐఫా లాంటి ప్రముఖ సంస్థలు కూడా ఈ పోస్ట్‌పై “ఆల్ఫా ఎనర్జీ” అంటూ కామెంట్స్ కురిపిస్తున్నాయి.

దీంతో సినిమాలో ఇద్దరి మధ్యా ఎలాంటి పోటీ లేదు, స్క్రీన్ స్పేస్ విషయంలో ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉంటుందని అలియా పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసారు. ఒక కో-స్టార్‌పై వస్తున్న ట్రోల్స్‌ను ఆపడానికి అలియా స్వయంగా ఇలా ఫన్నీగా రంగంలోకి దిగడం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. మొత్తానికి ఒకే ఒక్క పోస్ట్‌తో అలియా భట్ ‘ఆల్ఫా’ చుట్టూ ఉన్న నెగెటివిటీకి చెక్ పెట్టి, ఫ్యాన్స్‌లో మంచి జోష్ నింపారు.

Exit mobile version