మాస్ హీరోను సెట్ చేస్తున్న మారుతి.. నిజమేనా..?

‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, దర్శకుడు మారుతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఎవరితో చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే, తాను ఇప్పటికే తన నెక్స్ట్ మూవీ వర్క్స్‌ను ప్రారంభించినట్లు కొన్ని వారాల క్రితం మారుతి స్వయంగా వెల్లడించాడు.

తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. మారుతి తన నెక్స్ట్ చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజతో చేసే అవకాశం ఉన్నట్లు గట్టిగా టాక్ నడుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ వార్త మాత్రం నెట్టింట అభిమానుల దృష్టిని బాగా ఆకర్షించింది.

ప్రస్తుతం రవితేజ తన లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మారుతి, రవితేజల కాంబో గురించిన వస్తున్న ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయో మరియు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

Exit mobile version