లేటెస్ట్ గా మన టాలీవుడ్ నుంచి అనౌన్స్ అయ్యిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా “గాడ్ ఆఫ్ వార్” కూడా అని చెప్పొచ్చు. అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం సోషల్ మీడియాలో పలు అంశాలకి సంబంధించి డిస్కషన్ నడుస్తుంది. అయితే ఈ భారీ సినిమా విషయంలో సంగీత దర్శకుడు కోసం ఓ ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది.
మేకర్స్ అధికారికంగా అనిరుద్ ని అనౌన్స్ చేశారు. కానీ ఎస్ ఎస్ థమన్ మాత్రం తనని తాను ఈ ప్రాజెక్ట్ కి సంగీత దర్శకుడిగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు అని కొందరు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవం అనే చెప్పాలి. థమన్, త్రివిక్రమ్ తో ఉన్న అనుబంధం మేరకు మాత్రమే ఆ ప్రాజెక్ట్ కోసం పోస్ట్ లు వేయడం జరిగింది తప్పితే తనే సంగీతం అందిస్తున్నాను అనే రీతిలో అయితే ఎక్కడా హింట్ ఇవ్వలేదు. సో గాడ్ ఆఫ్ వార్ సంగీత దర్శకుడు విషయంలో జరుగుతున్న ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు అనుకోవచ్చు.
