టాలీవుడ్ యంగ్ హీరోస్ లో అఖిల్ అక్కినేని కూడా ఒకరు. తన కెరీర్ ఆరంభంలోనే భారీ క్రేజ్ ని చూసాడు అతను. అక్కడ నుంచి సినిమాల పరంగా సరైన హిట్ లేనప్పటికీ సినిమా సినిమాకి మాత్రం ఇంట్రెస్టింగ్ గా తన మార్కెట్ మాత్రం చెక్కు చెదరలేదు. ఇలా అఖిల్ హీరోగా నటించిన “లెనిన్” ఇప్పుడు ఏజెంట్ లాంటి డిజప్పాయింట్మెంట్ తర్వాత వచ్చింది.
ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి లెనిన్ ఇపుడు ఫుల్ మీల్స్ పెట్టింది అని చెప్పొచ్చు. లెనిన్ సినిమా రిజల్ట్ ఒక్కటే కాకుండా సినిమాలో అఖిల్ కూడా తన లోని కొత్త వెర్షన్ ని చూపించాడు. నటుడుగా చాలా పరిణితి తనలో కనిపించింది. సో ఈ రకంగా కూడా అఖిల్ కొట్టేశాడని చెప్పొచ్చు. ఇక సినిమా ఫుల్ రన్ లో ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి. ఇక ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే నాగవంశీ, నాగార్జున నిర్మాణం వహించారు.
