ఇండియన్ సినిమా రంగాన్ని మలుపు తిప్పిన దృశ్యకావ్యం ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై నేటికి సరిగ్గా 11 ఏళ్లు పూర్తయింది. దర్శకుడు రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ సంచలనం టాలీవుడ్ పరిధిని పాన్-ఇండియా స్థాయికి విస్తరించడమే కాకుండా, ఇప్పటికీ చెరగని లెగసీని కొనసాగిస్తోంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, మంచు కొండల నేపథ్యంలో ప్రభాస్ స్టైలిష్‌గా కూర్చున్న ఒక రేర్ వర్కింగ్ స్టిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. అమరేంద్ర బాహుబలి, శివుడిగా ప్రభాస్ కనబరిచిన నటన ఆయనను గ్లోబల్ స్టార్‌గా నిలబెట్టగా, ఈ ల్యాండ్‌మార్క్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ మాగ్నమ్ ఓపస్ చిత్రంలో రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషించగా, ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే.
