తమిళ హీరో అథర్వ మురళి, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రమే ‘ఇదయం మురళి’. తెలుగులో హృదయం మురళీ పేరిట విడుదల అయ్యి డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో ప్రేక్షకులకు ఒక ఊహించని క్రేజీ సర్ప్రైజ్ లభించింది. స్టార్ బ్యూటీ మాళవిక మోహనన్ ఈ చిత్రంలో ఒక క్యూట్ క్యామియో రోల్‌లో మెరవడం జరిగింది. తాజాగా ఆమె ఈ సినిమా షూటింగ్ లొకేషన్‌కు సంబంధించిన కొన్ని స్టన్నింగ్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
తమిళ వధువుగా మాళవిక.. ఫహద్‌తో క్రేజీ సీన్
ఈ సినిమాలో మాళవిక మోహనన్ సాంప్రదాయ తమిళ పెళ్లికూతురు గెటప్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. సీఎం విజయ్ ‘మాస్టర్’ సినిమా తర్వాత డిజైనర్ పల్లవి సింగ్ తనను మళ్లీ ఇంత అందంగా రెడీ చేశారంటూ మాళవిక తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇక ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్‌తో కలిసి ఒక ఫన్ సీన్ చేసినట్లు ఆమె వెల్లడించారు. ఫహద్ తనకు ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్ అని, ఇద్దరం కలిసి ఒక పూర్తి స్థాయి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ చిన్న పాత్రతోనే ఆ ముచ్చట తీరిందని ఆమె నవ్వుతూ చెప్పుకొచ్చారు.
కాలేజ్ రోజులు గుర్తొచ్చాయి!
‘హృదయం మురళి’ చిత్ర యూనిట్ మొత్తం చాలా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉందని, వారితో కలిసి పని చేస్తుంటే తనకు మళ్లీ కాలేజీ రోజుల్లోకి వెళ్లినట్లు అనిపించిందని మాళవిక తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం పెళ్లికూతురు గెటప్‌లో సీరియస్‌గా ఉన్న మాళవిక, ఆమె పక్కనే నిల్చొని మాట్లాడుతున్న ఫహద్ ఫాజిల్ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. థియేటర్లలో ఈ ఇద్దరి కాంబినేషన్ సీన్ ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది.
