‘ది ప్యారడైజ్’ కోసం దిల్ రాజు ఫ్యాన్సీ ఆఫర్.. మేకర్స్ ఇచ్చిన క్లారిటీ..!

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్‌పై కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతున్నప్పటికీ, ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ పోస్టర్ల వల్ల ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకోవడానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆసక్తి చూపుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్ర రైట్స్‌ను దక్కించుకునేందుకు ఆయన ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాని కెరీర్‌లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ సాధించే చిత్రంగా ‘ది ప్యారడైజ్’ నిలవబోతోందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే, మేకర్స్ దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా తాము అధికారికంగా వెల్లడిస్తామని వారు తెలిపారు.

సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ విలన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version