సీఎం విజయ్ సినిమా ర్యాంపేజ్ షురూ.. అప్పుడే బుకింగ్స్ లో ట్రెండింగ్

Jana Nayagan

కోలీవుడ్ స్టార్ నటుడు అలాగే ఇప్పుడు సీఎం విజయ్ హీరోగా నటించిన ఆఖరి సినిమానే జన నాయగన్. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో జన నాయకుడు పేరిట విడుదల కాబోతుంది. బాలయ్య హిట్ సినిమా భగవంత్ కేసరికి రీమేక్ అయినప్పటికీ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇలా కొన్ని నెలల వాయిదా తర్వాత ఈ చిత్రం గ్రాండ్ గా ఇప్పుడు విడుదలకి రాబోతుంది. మేకర్స్ నిన్ననే సినిమా డేట్ అనౌన్స్ చేసి ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో ఒకొక్కటిగా షోస్ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు. ఈ లిమిటెడ్ థియేటర్స్ లో మొదలైన కొన్ని గంటల్లోనే జన నాయకుడు ర్యాంపేజ్ చూపించాడు.

అప్పుడే బుక్ మై షోలో ఈ సినిమా ట్రెండింగ్ బుకింగ్స్ లోకి వచ్చేసింది. పైగా బెంగళూరు లాంటి సిటీ లలో ఈ సినిమాకి షాకింగ్ టికెట్ ధరలు ఉన్నప్పటికీ ఈ సినిమా అప్పుడే ఈ రేంజ్ లో పెర్ఫామ్ చేయడం అనేది అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version