దర్శకుడు, నిర్మాత ఎస్కే బషీద్ తెరకెక్కించిన తాజా హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘అమెన్’ (AMEN) జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఎస్బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై రేగుల నీరజరాణి సమర్పణలో, ఆర్ఎన్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో ఈ చిత్రం రూపొందింది. సరికొత్త కథాంశంతో, సరికొత్త నటీనటులతో సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ఈ సినిమాను నిర్మించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
చిత్ర విశేషాల గురించి ఎస్కే బషీద్ మాట్లాడుతూ, ఇప్పటివరకు వచ్చిన హారర్ చిత్రాల ధోరణికి భిన్నంగా ‘అమెన్’ ఉంటుందని పేర్కొన్నారు. సినిమాలో భయానక అంశాలు ఎక్కువగా ఉంటాయని, గుండె జబ్బులు ఉన్నవారు థియేటర్లకు రాకపోవడమే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చిత్రాన్ని ఆర్ఎన్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మేమే స్వయంగా థియేటర్లలోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు.
ఇటీవల విడుదలైన ఈ చిత్ర పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటోంది. అశోక్ దయ్యాల పీఆర్ఓగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
