మొదటి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న కొరటాల ?

Koratala Siva

నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా షూట్ లో ఊహించని విధంగా గాయానికి లోనైన సంగతి తెలిసిందే. దీంతో, కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా రాబోతున్న సినిమా పోస్ట్ ఫోన్ అయింది. ఆగస్టు లాస్ట్ వీక్ నుంచి ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన షెడ్యూల్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. బాలయ్య బెడ్ రెస్ట్ కారణంగా ఈ సినిమా షూట్ పోస్ట్ ఫోన్ అయిన సంగతి తెలిసిందే. ఐతే, సెంప్టెబర్ నాలుగో వారంలో ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

కాగా మొదట బాలయ్య లేని సీన్స్ ను షూట్ చేయనున్నారు. మొత్తానికి ఈ సినిమాలో బాలయ్యను పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారు కొరటాల శివ. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version