హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బెనాక గోల్డ్’ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, సంస్థ బ్రాండ్ అంబాసిడర్ నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బెనాక గోల్డ్ ఫౌండర్ భరత్ కుమార్ ఎస్, సంస్థ యాజమాన్యం మరియు సిబ్బందికి ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
పేద, మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడేలా అత్యుత్తమ సేవలందిస్తున్నందుకే ఈ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు అంగీకరించానని నాగబాబు వెల్లడించారు. ఆపదలు, అత్యవసర సమయాల్లో వేరే చోట కుదవబెట్టిన బంగారాన్ని విడిపించి, మార్కెట్ విలువ ప్రకారం సరైన ధర కట్టడమే కాకుండా.. ఆ మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో (ఇన్స్టాల్‌మెంట్స్) చెల్లించే వినూత్న సౌకర్యాన్ని ‘బెనాక గోల్డ్’ కల్పిస్తోందని ఆయన వివరించారు.
కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంస్థను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని వ్యవస్థాపకుడు భరత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ ఆవుల మాట్లాడుతూ, ఈ సంస్థకు సంబంధించిన యాడ్ షూట్‌లో నాగబాబుతో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా అనిపించిందని పేర్కొన్నారు.
