‘చెన్నై లవ్ స్టోరీ’ ర్యాంపేజ్.. పెద్ద ఎత్తున అదనపు షోలు!

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా, యంగ్ బ్యూటీ శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన అవైటెడ్ ఫాంటసీ ప్రేమకథనే చెన్నై లవ్ స్టోరీ. దర్శకుడు సాయి రాజేష్ అందించిన కథతో వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకొని భారీ ఓపెనింగ్స్ ని మొదటి రోజు సాధించింది.

ఇలా డే 1 కి సాలిడ్ రెస్పాన్స్ తో మొదలైన చెన్నై లవ్ స్టోరీ రెండో రోజుకి చేరుకునేసరికి గట్టి జంప్ ని అందుకుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అదనపు షోస్ కి డిమాండ్ పలికింది. మొత్తంగా ఇపుడు 300 కి పైగా అదనపు షోస్ చెన్నై లవ్ స్టోరీ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో పడుతున్నాయట. దీనితో ఈ సినిమా ర్యాంపేజ్ గట్టిగానే మొదలైంది అని చెప్పవచ్చు. ఇక ముందు సినిమాకి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. అలాగే మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version