ఈ రానున్న శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ కి రాబోతున్న అవైటెడ్ చిత్రాల్లో తమ మొదటి సినిమాగా యంగ్ అండ్ టాలెంటెడ్ నటీనటులు జయకృష్ణ ఘట్టమనేని అలాగే రాషా తడానీ తెలుగు సినిమాకి పరిచయం అవుతూ వస్తున్న చిత్రమే ‘శ్రీనివాస మంగాపురం’.
టాలెంటెడ్ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామాకి లేటెస్ట్ గా ‘వారణాసి’ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన బెస్ట్ విషెస్ అందిస్తూ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తన అన్నయ్య కొడుకు జయకృష్ణ టాలీవుడ్ కి హీరోగా పరిచయం అవ్వడం ఎంతో ఆనందంగా ఉందని అలాగే తన మొదటి సినిమా ‘రాజకుమారుడు’ రిలీజ్ డేట్ లోనే ఈ సినిమా కూడా వస్తుండడం అనేది డెఫినెట్ గా దత్తు గారి ఆలోచనే అయ్యుంటుంది అని, ఆయన ఇలాంటి విషయాల్లో చాలా పక్కాగా ఉంటారు.
నేను, అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ లాంటి వారు వైజయంతి మూవీ బ్యానర్ లోనే లాంచ్ అయ్యాము. అలాంటిది జయకృష్ణ, రాషా ఇద్దరూ కూడా ఇదే బ్యానర్ నుంచి లాంచ్ కావడం అనేది మీరు చాలా లక్కీ అని మహేష్ తెలిపారు. ఫైనల్ గా చిత్ర యూనిట్ మొత్తానికి తన బెస్ట్ విషెస్ చెప్పి ముగించడం ఇప్పుడు ఘట్టమనేని ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.
Extremely happy for #JaiKrishnaGhattamaneni and #RashaThadani on their debut with #SrinivasaMangapuram…. I wish the whole team the very best for July 30th!!! 🤗🤗🤗♥️♥️♥️@DirAjayBhupathi #RashaThadani @themohanbabu @AshwiniDuttCh @gvprakash @gemini_kiran @CKPicturesoffl pic.twitter.com/VPgSDQRmAn
— Mahesh Babu (@urstrulyMahesh) July 26, 2026
