‘కొరియన్‌ కనకరాజు’లో మెయిన్ హైలైట్ అదే !

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్‌ కనకరాజు’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన యంగ్ బ్యూటీ రితికా నాయక్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఐతే, ఈ సినిమాలో కమెడియన్ సత్య చేసిన కామెడీ ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోందని టాక్. సెకండ్ హాఫ్‌ లో సత్య కామెడీ ట్రాక్ మెయిన్ హైలైట్ అని, సత్య టైమింగ్ తో పాటు, అతని డైలాగ్ డెలివరీ, హావభావాలు కూడా ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్‌టైన్ చేస్తాయట.

ఎలాగూ సత్య తన ప్రత్యేక కామెడీ స్టైల్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అదే ఫార్ములాను ‘కొరియన్‌ కనకరాజు’లో కూడా కొనసాగిస్తూ మరోసారి తన మార్క్‌ను చూపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అన్నట్టు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హారర్, కామెడీ ఎలిమెంట్స్‌ను పర్ఫెక్ట్‌గా సినిమాలో ఎలివేట్ చేశాయట. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Exit mobile version