దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటేనే.. వివాదానికి కేంద్ర బిందువు. తన గురించి ఎవరు ఏమనుకుంటారో ? తన పోస్ట్ ల పై ఎదుటి వ్యక్తులు ఎలా ఫీల్ అవుతారో ? లాంటి వాటి గురించి వర్మ అస్సలు ఆలోచించడు. రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సీ. తాజాగా ఈ వివాదాస్పద డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీ పై, ప్లాప్ సినిమాల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీ అనేది కేవలం ఫ్లాప్ సినిమాల మీదే ఎక్కువగా నడుస్తుంది. అంతేగాని సినిమా ఇండస్ట్రీ హిట్ సినిమాల వల్ల నడవదు. ఇది చాలా మందికి తెలియదు’ అంటూ ఆర్జీవీ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. మొత్తానికి సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. తన శైలి కామెంట్స్ కు మాత్రం వర్మ గ్యాప్ ఇవ్వడం లేదు.
