‘ఫౌజీ’ విడుదల పై నిర్మాత క్లారిటీ !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’. ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి నెలకొన్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ పాన్-ఇండియన్ రొమాంటిక్ వార్ యాక్షన్ డ్రామా చిత్రం, ముందుగా ప్రకటించినట్లుగానే 2026 డిసెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుందని నిర్మాత రవి శంకర్ స్పష్టం చేశారు. ఈ చిత్రం అనుకున్న తేదికి విడుదల కాకపోవచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

అయితే, రవి శంకర్ ఆ వార్తలను ఖండించారు. ‘ఫౌజీ’ అనుకున్న సమయానికే విడుదలవుతుందని అభిమానులకు భరోసా ఇచ్చారు. కాగా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో భారీ హిస్టారికల్ సినిమాగా తీస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 2న ప్రీమియర్స్ కూడా పడనున్నాయి. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా ఇమాన్వి ప్రభాస్ సరసన నటిస్తుంది. రూ. 700 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద మరియు ఇతర ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version