‘మా నాన్న సీఎం కావడం ఓ విప్లవం – జాసన్ సంజయ్‌

‘విజయ్’ తమిళ స్టార్ హీరో నుంచి ఇప్పుడు తమిళనాడు సీఎంగా మారిపోయాడు. పైగా ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించాక ప్రజలకు తనదైన సేవ చేస్తున్నాడు. ఐతే, విజయ్ సీఎం అయ్యాక, ఆయన ఫ్యామిలీ మాత్రం ఆయనతో కలిసి ఉన్నట్లు ఎక్కడా కనిపించలేదు. తాజాగా తన తండ్రి సీఎం కావడం ఓ విప్లవమని విజయ్‌ కుమారుడు జాసన్ సంజయ్‌ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జాసన్ సంజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిగ్మా’ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది.

ఈ నేపథ్యంలో జాసన్ సంజయ్‌ ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మా నాన్న ముఖ్యమంత్రి కావడం సమాజంలో వచ్చిన ఓ చారిత్రాత్మకమైన విప్లవం. మా నాన్న సీఎం అయ్యాక నా పై బాధ్యత పెరిగింది. నేను మా కుటుంబం ఆయన వారసత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇక నేను ఇండస్ట్రీకి వస్తానన్నప్పుడు సొంతంగా నాకంటూ ఓ పేరు, గుర్తింపు తెచ్చుకోవాలని మా నాన్న చెప్పారు. ఎంత కష్టమైనా నా కాళ్లపై నేనే నిలబడాలని ఆయన సలహా ఇచ్చారు’ అంటూ జాసన్ సంజయ్‌ చెప్పుకొచ్చారు.

Exit mobile version