బాలీవుడ్ సినిమా నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అవైటెడ్ పాన్ వరల్డ్ సినిమానే రామాయణ. దర్శకుడు నితీష్ తివారి, రణబీర్ కపూర్, సాయి పల్లవి అలాగే యష్ ల కలయికలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేయగా ఒక ప్రాపర్ వరల్డ్ వైడ్ రిలీజ్ కి దీన్ని తీసుకొస్తున్నారు. అందులో భాగంగా లేటెస్ట్ స్పైడర్ మ్యాన్ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ తో జత కట్టిన మేకర్స్ రామాయణ ట్రైలర్ ని ప్రపంచ ఆడియెన్స్ ముందుకు ఇంగ్లీష్ వెర్షన్ లో తీసుకొచ్చారు.
ఇంట్రెస్టింగ్ గా ఇందులో ఏ ఐ సాయంతో అందరి లిప్ సింక్ కూడా ఇంగ్లీష్ లోనే ప్లాన్ చేయడం విశేషం. అంతేకాకుండా దీనితోనే విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా రామాయణ నవంబర్ 6న వస్తున్నట్లు ఖరారు చేశారు. సో రామాయణ ట్రైలర్, సినిమాకి మంచి రీచ్ దక్కినట్టే అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణం వహించారు.
