దుమ్ము లేపుతున్న ‘కొరియన్ కనకరాజు’.. 2 రోజుల వసూళ్లు ఎంతంటే!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ హా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన అవైటెడ్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే ‘కొరియన్ కనకరాజు’. మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్ లో మరో బిగ్ హిట్ దిశగా వెళుతుంది. ఆల్రెడీ తన కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 2 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది.

మొత్తం ఈ రెండు రోజుల్లో కొరియన్ కనకరాజు 23.6 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టుగా మేకర్స్ రివీల్ చేశారు. దీనితో రెండో రోజు కూడా 10 కోట్లకి పైగానే ఈ సినిమాకి గ్రాస్ నమోదు అయ్యింది అని చెప్పవచ్చు. యూఎస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా 2 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ క్రాస్ చేసింది. ఇక ఈ ఆదివారం వసూళ్లు కూడా సినిమాకి కీలకం కాగా ఈరోజున ఎంత వసూలు చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version